Hiring Alert: ఎడ్యుటెక్ కంపెనీ Tech Vedhu బెంగళూరు ఆఫీస్ కోసం Business Development Associate లను తీసుకుంటోంది. తెలుగు మరియు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగే, సేల్స్‌లో కెరీర్ మొదలుపెట్టాలనుకునే ఫ్రెషర్స్‌కి ఇది అవకాశం.

Tech Vedhu ఒక అప్‌స్కిల్లింగ్ (ఆన్‌లైన్ కోర్సులు) ప్లాట్‌ఫామ్. ఈ రోల్‌లో కోర్సుల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఫోన్ చేసి, వాళ్ల అవసరం అర్థం చేసుకుని, సరైన కోర్సు సజెస్ట్ చేసి అమ్మాలి. అంటే ఇది పూర్తిగా B2C సేల్స్ (ఫోన్ సేల్స్) జాబ్, టార్గెట్స్ ఉంటాయి. మాట్లాడటం ఇష్టమై, సేల్స్‌లో ఎదగాలనుకునే వాళ్లకి సరిపోతుంది.

లొకేషన్ బెంగళూరు, కర్ణాటక. 0 నుండి 1 సంవత్సరం అనుభవం ఉన్నవాళ్లు అప్లై చేయవచ్చు. కంపెనీ అప్లికేషన్ ఫామ్ ప్రకారం మొదటి 2 నెలలు ప్రొబేషన్ (స్టైపెండ్ ₹30,000 అని చెప్పారు), తర్వాత ఫుల్-టైమ్ CTC ₹3.5 LPA నుండి ₹5.5 LPA (పెర్ఫార్మెన్స్ ఆధారంగా). పూర్తి వివరాలు కింద చూద్దాం.

Tech Vedhu Business Development Associate Recruitment 2026 – Job Overview

Job Parameter Details
CompanyTech Vedhu (EdTech / Upskilling)
Job RoleBusiness Development Associate (B2C Sales)
QualificationAny Graduate
Batch2025, 2026, 2027, 2028 (ఫామ్‌లో ఇచ్చిన ఆప్షన్స్)
Experience LevelFreshers & 0 – 1 Year
Job LocationBengaluru, Karnataka (Office)
CTC (Full-Time)₹3.5 LPA – ₹5.5 LPA (Performance-Based)
Probation2 Months (Stipend ₹30,000 as per form – fixed vs incentive split confirm చేసుకోండి)
LanguagesTelugu / Tamil / Kannada / Hindi + English
Application ModeOnline (Tech Vedhu Google Form)

జాబ్ డీటెయిల్స్ & రోల్ గురించి (About the Job)

ఇది ఇన్‌సైడ్ సేల్స్ రోల్. కోర్సుల గురించి ఎంక్వైరీ చేసిన వాళ్లకి (లీడ్స్) ఫోన్ చేసి మాట్లాడాలి, వాళ్లకి ఏ కోర్సు సరిపోతుందో చెప్పి, అడ్మిషన్ తీసుకునేలా కన్విన్స్ చేయాలి. జీతంలో ఒక భాగం మీరు చేసే సేల్స్ మీద ఆధారపడి ఉంటుంది. తెలుగు స్టేట్స్ లీడ్స్‌కి మాట్లాడటానికి తెలుగు వచ్చినవాళ్లకి ప్రాధాన్యం ఉంటుంది.

ఈ రోల్‌లో మీ డ్యూటీస్ & బాధ్యతలు (Job Responsibilities)

  • కోర్సుల్లో ఆసక్తి ఉన్న వాళ్లకి కాల్ చేసి, సీరియస్ లీడ్స్‌ని గుర్తించడం.
  • వాళ్ల కెరీర్ గోల్స్ అర్థం చేసుకుని సరైన కోర్సు సజెస్ట్ చేయడం.
  • కోర్సు గురించి ప్రెజెంటేషన్ ఇవ్వడం, వాళ్ల డౌట్స్ క్లియర్ చేయడం.
  • ఆసక్తి ఉన్న వాళ్లని ఫాలో-అప్ చేసి అడ్మిషన్‌గా మార్చడం.
  • CRM లో లీడ్స్, కస్టమర్ రికార్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేయడం.

ఎవరు అప్లై చేసుకోవచ్చు? (Eligibility Criteria)

  • ఎడ్యుకేషన్: ఏదైనా డిగ్రీ. ఫామ్‌లో 2025 – 2028 పాస్-అవుట్ ఆప్షన్స్ ఉన్నాయి.
  • అనుభవం: ఫ్రెషర్స్ లేదా 1 సంవత్సరం వరకు. ఎడ్యుకేషన్ / టెక్ B2C సేల్స్ అనుభవం ఉంటే ప్లస్.
  • లాంగ్వేజ్: ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ లేదా హిందీ బాగా మాట్లాడగలగాలి.
  • స్కిల్స్: మంచి కమ్యూనికేషన్, టార్గెట్స్‌తో పని చేసే ఆసక్తి. CRM టూల్స్ తెలిస్తే ప్లస్.
  • లొకేషన్: బెంగళూరు ఆఫీస్‌కి రిపోర్ట్ చేయాలి.

జీతం & ప్రయోజనాలు (Salary & Benefits)

కంపెనీ ఫామ్ ప్రకారం ఫుల్-టైమ్ అయ్యాక CTC ₹3.5 LPA నుండి ₹5.5 LPA (పెర్ఫార్మెన్స్ ఆధారంగా), దీంతో పాటు సేల్స్ కమిషన్ ఉంటుంది. 2 నెలల ప్రొబేషన్‌లో స్టైపెండ్ ₹30,000 అని ఫామ్‌లో ఉంది. అయితే ఇదే కంపెనీ ఇతర జాబ్ సైట్స్‌లో ₹17,000 ఫిక్స్‌డ్ + ఇన్సెంటివ్స్ అని కూడా పెట్టింది. కాబట్టి ఇంటర్వ్యూలో ఫిక్స్‌డ్ ఎంత, ఇన్సెంటివ్ ఎంత, ఫుల్-టైమ్ కన్వర్షన్ కండిషన్స్ ఏంటి అని తప్పకుండా అడిగి, ఆఫర్ లెటర్‌లో రాతపూర్వకంగా చూసుకోండి.

ఎలా అప్లై చేయాలి? (Step-by-Step How to Apply)

  1. కింద ఇచ్చిన Tech Vedhu Hiring Google Form లింక్‌పై క్లిక్ చేయండి.
  2. పేరు, ఈమెయిల్, మొబైల్ నంబర్, కాలేజ్, డిపార్ట్‌మెంట్, పాస్-అవుట్ ఇయర్ ఫిల్ చేయండి.
  3. Preferable Language లో Telugu/English సెలెక్ట్ చేయండి.
  4. రెజ్యూమ్ (10 MB లోపు) అప్‌లోడ్ చేసి Submit చేయండి.
  5. లాస్ట్ డేట్ చెప్పలేదు, కాబట్టి వీలైనంత త్వరగా అప్లై చేయండి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఇది IT జాబ్ ఆ?

కాదు. ఇది ఎడ్యుటెక్ కంపెనీలో కోర్సులు అమ్మే ఫోన్ సేల్స్ (Business Development) జాబ్. కోడింగ్ అవసరం లేదు.

2. సేల్స్ టార్గెట్స్ ఉంటాయా?

అవును. కంపెనీ "target-oriented" అని స్పష్టంగా చెప్పింది, జీతంలో కొంత భాగం పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది.

3. 2027, 2028 బ్యాచ్ అప్లై చేయవచ్చా?

ఫామ్‌లో ఆ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఇది ఫుల్-టైమ్ ఆఫీస్ జాబ్. జాయినింగ్ ఎప్పుడో రిక్రూటర్‌ని అడిగి కన్ఫర్మ్ చేసుకోండి.

4. అప్లై చేయడానికి ఫీజు ఉందా?

లేదు. రిజిస్ట్రేషన్, ఇంటర్వ్యూ, ట్రైనింగ్ లేదా జాబ్ కన్ఫర్మేషన్ కోసం ఎవరైనా డబ్బు అడిగితే అది మోసం, కట్టకండి.

Tech Vedhu Official Application Form

Tech Vedhu హైరింగ్ ఫామ్ ద్వారా నేరుగా ఉచితంగా అప్లై చేసుకోండి.

👉 Click Here to Apply (Tech Vedhu Form)
Preparing for the Tech Vedhu interview?

Get our free Starter Pack: 10 ATS resume rules, the 10 HR questions every fresher is asked (with sample answers), and a job scam checklist.

Download free PDF See the full Placement Kit →
Disclaimer: FreshersBlog.com is a job information portal. We do not charge any fee for job applications. The details provided above are curated from official sources for informational purposes. Please verify all details on the official company website before applying.